శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కృష్ణలీలా తరంగాలు*

>> Wednesday, December 6, 2017

🔯🔯🔯🔯🔯🔯

 *కృష్ణలీలా తరంగాలు*
      🌸🌸🌸
🌷సిద్దేంద్రయోగి...వారి గురువు నారాయణతీర్థులు!

🌷నారాయణ తీర్థుల వారికి దృష్టిదోషం ఉండేది.

 రోజూ రాత్రిళ్ళు భోజనాలయ్యాకా వసారాలో పడుకుని కళ్ళుమూసుకుని
తరంగాలు పాడుకునేవారు.

🌷బాలకృఘ్ణడొచ్చి...
తీర్థులవారి బొజ్జమీదెక్కి...
తాండవం చేసేవాడు.
తాండవ కృష్ణుడి నృత్యం రోజూ చూస్తున్న సిద్దయ్య...

🌷ఓ రోజు
 "గురూ గారూ....!
రోజూ బాలకృఘ్ణడు
మీ బొజ్జమీద తాండవం చేస్తోంటే మీకు పొట్టనొప్పిగా ఉండట్లేదూ?"
అని అడిగాడు

"బాలకృఘ్ణడి తాండవమా...ఎప్పుడ్రా...?"

🌷"అయ్యో! రాత్రిళ్ళు....
మీరు నిద్రపోయే ముందు తరంగాలు అంటారు గదా....
అప్పుడు బాలకృఘ్ణడు తాండవం చేస్తాడు...
నేను రోజూ చూస్తున్నాగా...!"

🌷"ఎంత అదృష్టవంతుడివిరా...
గుడ్డి పీనుగుని నాకు కనపడ్డేం...?!"
అని కళ్ళు తుడుచుకుని

🌷"ఒరే...
ఈసారి కృఘ్ణడు కనబడ్తే మనిద్దరికీ జన్మరాహిత్యం ఎప్పుడో కనుక్కో...!"

*"ఓ...అలాగే...!"*
 *అన్నాడు సిద్దప్ప...!*

🌷మర్నాడు రాత్రి బాలకృఘ్ణడు కనపడగానే దణ్ణం పెట్టి "జగద్గురూ....
మా గురూగారికీ,
నాకూ మోక్షం ఎప్పుడు?" అన్నాడు.

🌷"నీకు ఈ జన్మలోనే... నా దర్శనం అయ్యిందిగా.....!
మీ గురూగారికి మాత్రం మరో జన్ముంది!!"
అన్నాడు.

*మురళి మనోహరంగా మోగింది*

🌷అంచేతే సిద్దేంద్ర యోగి ...యక్షగానాన్ని ఆంధ్ర దేశం అంతటా ప్రదర్శించి...
పుణ్యలోకాల కెళ్ళారు.

ఆ తర్వాత...వారి గురువు నారాయణతీర్థులు.

🌷 *"కృష్ణం కలయ సఖీ సుందరం*
*బాలకృష్ణం కలయ సఖీ సుందరం*
*కృష్ణం గత*
*విషయ తృష్ణం..."*

అవి వ్రాసినాయన `నారాయణ తీర్థులు’🌞

🔯🔯🔯🔯🔯🔯

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP