శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మీకు నచ్చినంతవరకే మనసుకి తీసుకోండి !! 100% వాస్తవం అని నేను అనట్లేదు!!

>> Wednesday, September 13, 2017

మీకు నచ్చినంతవరకే మనసుకి తీసుకోండి !!
100% వాస్తవం అని నేను అనట్లేదు!!
100% వాస్తవం అని నేను అనట్లేదు!!

*1978 అప్పటి వరకూ మాకు హీరో సైకిల్ ఉండేది...కొత్తగా మా ఇంటికి సువేగా డీలక్స్  వచ్చింది...ఏదో తెలియని ఆనందం..*

*ఆదివారం వచ్చిందంటే చాలు కిరసనాయిలు తో రిమ్ములు తుడిచేసి కొబ్బరి నూనె గుడ్డ తో తుడిచేసి చూస్తంటే ఆ ఆనందమే వేరండీ...*

*ఆదివారం వచ్చిందంటే ఇంట్లో అన్ని పనులు చేసే వాళ్లం...ఆంధ్రా బ్యాంకు వారి కిడ్డీ బ్యాంకు అని అకౌంట్ ఉండేది...ఇంట్లో ఇచ్చిన చిల్లర డబ్బులు అన్నీ ఆ కిడ్డీ బొమ్మ లో దాచే వాళ్లం ....*

*ఇప్పుడు తరం పిల్లలు బండి తుడవమంటే తుడవరు.*
*మేజోళ్ళు అదే నండీ సాక్సులు ఉతుక్కోమంటే ఉతకరు...*
*కనీసం అండర్ వేర్ లు ఉతుక్కోమన్నా ఉతకడం లేదు...*
*లంచ్ బ్యాగ్ లు శుభ్రం చేసుకోవడంలేదు...*
*ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే నూడుల్స్ ప్యాకెట్లు ఫైవ్ స్టార్ లు ఐస్ క్రీమ్ లు కూల్ డ్రింక్ లు కొనుగోలు చేస్తున్నారు...*

*ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు...*
*ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి...*
*డిగ్రీ చదువుతున్న ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..*

*తల్లి దండ్రులు మారాలి*

*భార్య కు వంట వండటం సరిగా రాదని  నేటి యువత బిర్యానీ లు కర్రీ పాయింట్ ల వెంట పడుతూ  చిన్న వయసు లోనే గ్యాస్టిక్ అల్సర్ గాల్ బ్యాడర్ స్టోన్స్ కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు*

*మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం...*
*కాలేజీ పిల్లలు అయితే చిన్న టిఫెన్ బాక్సు రైస్..*

*Pregnant అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం*
*టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం*

*ఈ రోజు ఒక స్కూలు అమ్మాయి స్కూల్ అవ్వగానే  500 రూపాయల కాగితం ఓ షాపు అతనికి ఇచ్చి* 
*ఏదో 30 రూపాయల ice cream కొనుగోలు చేసింది*
*షాపు అతను 470 ఇచ్చాడు...*
*ఆ అమ్మాయి చిల్లర ఎంత ఇచ్చారో కూడా లెక్క పెట్టు కోలేదు....*
*షాపు అతను చిల్లర సరిపోయిందా అని అడిగితే సరిపోతాయి లే అంకుల్ అంది...*

*రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం..?*

*ఒక్క సారి ఆలోచన చేయండి. ...*

*సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి కేవలం*
*గుడికి వెళ్లో, చర్చికి వెళ్లో మసీదుకు వెళ్లో* 
*మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాం*
*అనుకోవడం పొరపాటు.*


*బాధ్యత*
*బరువు*
*కష్టం*
*నష్టం*
*ఓర్పు*
*సహనం*
​​
*దాతృత్వం*
*ప్రేమ*
*అనురాగం*
*సహయం*
*సహకారం*
*నాయకత్వం*
*మానసిక ద్రృఢత్వం*
*కుటుంబ బంధాలు* *అనుబంధాలు అంటే ఏమిటో*
*పిల్లలకు అలవాటు చేద్దాం. ..*

*మనం కూడా మమేకమవుదాం....*

*భావి తరాలకు ఒక మానవీయ, విలువలుతొ కూడిన ,  సత్సాంప్రదాయ కుటుంబాలను కలిగిన సమాజానికై  బాటలు వేద్దాం. ...*

Kbn sharma garu

2 వ్యాఖ్యలు:

GKK September 13, 2017 at 10:49 PM  

Very good post. Reflects the present situation.

K.S.Chowdary September 14, 2017 at 3:30 AM  

Good Post

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP