శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

భద్రాచలం లో కళ్యాణంలో జరుగుతున్న అవకతవకలు సరిచేయాలి

>> Wednesday, March 15, 2017

రాముని కళ్యాణం లోకకళ్యాణం. కాని ఆ కళ్యాణంలో సీతారాములకు అన్యాయం జరుగుతుంటే ఎవ్వరికీ పట్టటం లేదు. ఎంత విచారకరం? నోరులేని విగ్రహాలులే అని సీతారాముల ముందే వారి గోత్రప్రవరలు కాక మరొకరి గోత్రప్రవరలు చెప్తే వారి కళ్యాణమెలా అవుతుంది? ఎవరో ఒక వ్యక్తి పుర్రెలో పుట్టిన ఆలోచన యావత్సమాజాన్ని వంచిస్తోంది. భద్రాద్రిలో జరుగుతున్న రామకళ్యాణ భంగాన్ని అందరూ ఖండించాలి. నవమినాడు పుట్టిన రాముడు దశరథరాముడు. కాబట్టి దశరథరామునిగా ఆయన గోత్రప్రవరలతో జనకసుతగా సీతమ్మ గోత్రప్రవరలతో కళ్యాణం జరపాలి. కాని ఆయనను ‘రామనారాయణు’డని వసిష్ఠుడు పెట్టని పేరును వీరు తగిలించి గోత్రప్రవరలు ఎత్తేయడం ఎంత అన్యాయం! రామభక్తి కలవారంతా ఈ కుట్రను గ్రహించి ధర్మపక్షాన నిల్వాలి. శాస్త్రవిరుద్ధంగా సీతారాములకు జరిగే అన్యాయాన్ని ఖండించాలి.
90 ఏళ్ళ వైష్ణవ అర్చక స్వామి అనేక కళ్యాణాలు భద్రాద్రిలో తాము నిర్వహించామని అప్పుడు గోత్రప్రవరల అన్యాయం చేయలేదని స్వయంగా చెప్పారు. దాని రికార్డును విన్పించారు కూడా. కళ్యాణ ప్రత్యక్ష వ్యాఖ్యానారంభకులు శ్రీ జమ్ములమడక మాధవరామ శర్మగారి గ్రంథాల ద్వారా వారి కాలంలో దశరథ జనకుల గోత్రప్రవరలే చెప్పినట్లు తెలుస్తోంది. చాలామంది పండితులకీ అన్యాయం తెలుసు. కాని మనకెందుకులే అని మిన్నకుంటున్నారు. ఈ ఉపేక్ష చాలా ప్రమాదకరం. ‘రాజా కాలస్య కారణం’ అని దీని దుష్పరిణామం ఎప్పటికైనా రాజుపై పడుతుంది. ప్రజాపాలన కావటం వల్ల ప్రజలపై పడుతుంది. కాబట్టి ప్రతివారూ ప్రభుత్వాధికారుల దృష్టికి తీసికొనివెళ్లి ఈ అన్యాయాన్ని ఆపుచేయించటం అత్యవసరం. ఈవిధంగా ప్రతి వ్యక్తి తమవంతు కృషి చేయాలి. శ్రీరామునకు సక్రమమయిన రీతిలో భద్రాద్రి రామకళ్యాణం జరిగేటట్లు చూడాలి. వాట్సప్, ఈమెయిల్, ఫేస్ బుక్, ట్విట్టర్ ల ద్వారా ఈ అన్యాయాన్ని సమాజానికి తెల్పి రామసేవలో భాగస్వాములు కావాలి
. – అన్నదానం చిదంబర శాస్త్రి

1 వ్యాఖ్యలు:

శ్యామలీయం March 16, 2017 at 10:02 PM  

దేవుళ్ళనే మార్చే ప్రజాప్రభువుల కాలాల్లో దెవుళ్ళగోత్రాలు మార్చటం‌ ఒక లెక్కా?
నిద్రలో నున్నారు నీ భక్తులు
భద్రాద్రి రామయ్యా బాధపడకు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP