శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ రక్షాయాగం [ఐదవ ఆవృతి] కి హనుమత్ పరివారంగా రారండి ..

>> Saturday, September 29, 2012























హనుమంతుడు ధర్మరక్షకుడు. అటు భగవత్ తత్వాన్ని అందించి పరమాత్ముని దరిచేర్చే సద్గురువుగానూ ,ఇటు భక్తుల ఆపదలను తొలగించి కాపాడే భక్తజన రక్షకునిగానూ ఆయన మానవులను కాపాడుతున్నారు. ఈ యుగాన ధర్మసంరక్షణకై ,ధార్మికుల జీవితాలలో ఎదురవుతున్న ఇక్కట్లను తొలగిమ్చు కొనుటకునూ హనుమదుపాసన ఆవశ్యకత అన్నిఆథ్యాత్మిక  సాంప్రదాయాలూ అంగీకరించినదే . పైగా ఈ యుగములో శీఘ్రఫలములివ్వటమేగాక శీలవర్ధనము లో యువతకు మార్గదర్శనం ఆయన ఉపాసనలో లభిస్తుంది. ఇన్నేల ... జయం ..కొరకు అన్నింటా విజయం కొరకు ఆయన నుపాసించుట ఉత్తమమార్గము.

లోకశ్రేయస్సుకొరకై  "శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం"  భక్తులు తమ భక్తిద్వారా స్వామిని మెప్పించి ఆయన అనుగ్రహంతో తమ బాధలను  నివారించుకుని జయములు పొందుటకు ఒక ఆథ్యాత్మిక ప్రయోగంగా "హనుమత్ రక్షాయాగము" మును నిర్వహిస్తూ వస్తున్న సంగతి భక్తజనావళికి విదితమే. గతంలో నిర్వహించిన నాలుగు ఆవృతులలోనూ   ఈసాధనా విధిలో పాల్గొని తమ జీవితాలలో స్వామి అనుగ్రహాన్ని చవిచూసిన ఎంతో మంది భక్తులు,ముఖ్యంగా యువత వారి జీవితంలో జరిగిన అద్భుతములను వివరిస్తూ  స్వామి కృపకు ప్రత్యక్ష నిదర్శనములుగా ఉన్నారు. ఎంతో మంది  తమజీవితములలోఉద్యోగ,కుటుంబములలోవచ్చిన,కష్టములను,జాతకదోషాలనుఆరోగ్య సమస్యలు,మానసిక బాధలు,అథ్యాత్మిక సమస్యలను స్వామి  ఉపాసన శక్తి ద్వారా పరిష్కరించుకున్నారు. అందుకు వారి భక్తి ,స్వామి శక్తియే కారణములుగాక వేరుగాదు.
 ఎవరో  చెప్పినమాట నమ్మటం కాక మీజీవితంలో మీరు స్వయంగా స్వామిని ఉపాసించి ఆయన  అనుగ్రహమును
చవిచూడవలెననుకొనువారు స్వామిని  శ్రధ్ధాశక్తులతో  ఈ సాధనలో పాల్గొని హనుమత్ శక్తి జాగరణ ద్వారా మీజీవితంలో ప్రత్యక్షముగా పరిశీలించుకొనగలరు. ఇంతా చేసి  భక్తజన సులభుడైన స్వామి సాధనామార్గము కూడా చాలా సరళము. అయితే ధార్మిక బుధ్ధి,నిజాయితీ, నిష్కలంకమైన మనస్సు ,నిర్మలమైన జీవితగమనము ఈసాధనకు కావలసిన నియమములు. అసలు ఈసాధనద్వారా జీవితంలో ప్రవేశించే గుణములే ఇవి.


ఈసారి  అక్టోబర్  ఇరవై నాలుగు   విజయదశమి రోజునుండి  సాధనా కార్యక్రమము మొదలై  మాఘశుద్ధ ఏకాదశి [2013 feb 21]రోజున పూర్ణాహుతిగా హనుమత్ రక్షాయాగం సాగుతుంది. స్వామికి ఇష్టమైన సంఖ్య ఐదు. ఈసారి జరుగుతున్నది కూడా ఐదవ ఆవృతి.

ఇక ఈ సాధనలో పాల్గొనదలచుకున్నవారు    విజయదశమి నుండి గాని ఆతరువాత మంచి రోజు చూసుకుని గానీ మొదలు పెట్టాలి. ముందుగా మీగోత్రనామాలను పీఠమునకు తెలియపరచి మీరు మీ సాధనను మీరున్న చోటులోనే కొనసాగించవచ్చు. ఈసాధనాకాలములో ధర్మబధ్ధమైన జీవనం గడుపుట ప్రధాన నియమము.  తీవ్రమైనసమస్యలను పరిష్కరించుకోదలచినవారు  వారికి ప్రత్యేక నియమాలను తెలియపరచుట జరుగుతుంది.
  నిద్రలేస్తూనే  ఎలాఉన్నవారు అలానే  "శ్రీరామ " అను తారకనామమును  నూటా ఎనిమిది సార్లు జపించాలి . ఆతరువాత మీరు స్నానానంతరం  ' హనుమాన్ చాలీశాను కనీసం ఐదుసార్లన్నా పారాయణం  ఐదుసార్లు శ్రీరామ అని ప్రతిలో లిఖించాలి.  మరలా స్వామికి ప్రీతి కనుక "శ్రీరామ జయరామ జయజయరామ" అను జయ మంత్రమును నూటాఎనిమిది సార్లు జపించి ఒక్కగడిలో శ్రీరామ అని వ్రాయాలి. ఇలా ఎన్ని చాలీసాలు చేస్తే అన్ని సార్లు రామనామాన్ని, ఎన్నిసార్లు నూటఎనిమిది జయమంత్రముల చొప్పున   చేస్తారో అన్ని రామనామములు గడులలో నింపాలి. ఇలా ఉదయం సాయంత్రం వేళలలో నూ చేయవచ్చు.  , స్త్రీలకు నిషేధమైన  నాల్గురోజులు జపం చేయరాదు .  తీవ్రమైన అనారోగ్యసమస్యలున్నవారు ఉన్నచోట ఉండే  సాధనజరుపుకోవచ్చు ఓపిక సమకూరినదాకా.  పూజాధికములనునవి మీశక్త్యానుసారముగా చేసుకొనవచ్చు.  శని.లేదా మంగళవారంలో ఒకరోజు స్వామి ఆలయానికెళ్లి ప్రదక్షిణలు చేయండి.

ఇక హనుమాన్ చాలీసా పఠనం రానివారు .స్వామికి చెప్పుకుని  జయమంత్రమునే[శ్రీరామజయరామ జయజయరామ} జపిస్తూ ఒక్కో నూటఎనిమిది జపమునకు ఒక్కొక్క గడిలో శ్రీరామ అనిలిఖించాలి.
[ఇది  ఖచ్చితంగా చాలీసా చేయలేనివారికి మాత్రమే. సోమరితనంతో నియమములు సడలించు కోదలచినవారికి కాదు.]

మీప్రతి  పూర్తికాగానే  పోస్ట్ లేదా కొరియర్లో పీఠమునకు పంపవలెను. పూర్ణాహుతి సమయములో మీతరపున ఇక్కడ మీగోత్రనామములతో పూజజరుపుటయేగా మాఘమాసములో భద్రాద్రిలో జరుగుతున్న "శ్రీరామపట్టాభిషేక" ములోనూ స్వామివారికి సమర్పించుట జరుగుతుంది.
ఈ ప్రతులను  ఇక్కడనుండి డౌన్ లోడ్ చేసుకొనవచ్చు. లేదా మీకుసమీపంలో ఈ యాగ కార్యకర్తలు ఉన్నచో వారిదగ్గరనుండి తీసుకొనవచ్చు.
పూర్ణాహుతి యాగములో స్వయముగా పాల్గొనదలచినవారు మాత్రం నలుబదిరోజులు నియమనిష్ఠ లతో సాధన కొనసాగించవలసి ఉంది. అడిగినవారికి ఆవివరాలు అందజేస్తాము.  యాగానంతరం హనుమద్రక్షలు మీకు పంపబడతాయి పోస్ట్ ఖర్చులు మీరు భరిస్తే.
ఇక  హోమములో ప్రత్యక్షంగా పాల్గొనవలసినవారు   పూర్ణాహుతికి 21 రోజుల ముందునుండి మధ్యమాంసాదులను స్వీకరించరాదు[క్షమించాలి ..అలవాటువున్నవారికోసముమాత్రమే చెప్పటం జరిగినది] . భార్యాభర్తలు యాగనియమాలతో పారాయణం  చేసి పూర్ణాహుతిలో పాల్గొనగలరు .


భగవత్ ప్రసాదమును పదిమందితో పంచుకొనుట మనసాంప్రదాయము . మీచుట్టూ వున్న దీనులు,పీడితులు,కష్టములు కడగండ్లతో అల్లల్లాడుచున్నవారుంటారు. వారికి ఈ సాధనను అందించండి. దీనికి చదువుకున్నవారే కానక్కరలేదు. స్వామి పై భక్తి ఉన్నప్రతి ఒక్కరు చేయవచ్చు. కులమతలింగవర్ణబేధాలేవీ అక్కరలేదు. ఈ ప్రసాదవితరణ మహాపుణ్యము. ఇందుకుగాను మీరేమీ ఎవరికీ పైసా ఇవ్వనక్కరలేదు. స్వామి పై భక్తితో మనము తరించుటయేగాక దీనులైన మరెందరికో స్వామి పాదాలను ఆశ్రయించు ఈమార్గము  అందించవచ్చు. పదిమందికి మేలు చేసినచో అందులోనూ మనకుపుణ్యభాగం లభిస్తుందని శాస్త్రవచనం.

ఈసాధనా కాలములో లోకశ్రేయస్సుకై గ్రామాలలోనూ,పట్టణాలలోనూ పలువురకు స్వామి అనుగ్రహం పొందుటకై కొన్ని ఆథ్యాత్మిక కార్యక్రమములు జరుపబడతాయి. ఒక సత్సంగంగానో హనుమ పరివారంగానో మీరు ముందుకొస్తే ఆయాకార్యక్రమములు వివరాలు అందజేయబడతాయి. ఇందులో ఎవరికీ ఆర్ధిక  భారములు లేకుండా వేలమందితో కార్యక్రమములు. పీఠం నిర్వహిస్తున్నది. నమ్మలేకుండాఉంటే ఫోన్లో సంప్రదించండి. వివరంగా చెబుతాము .
  జైశ్రీరాం....జైహనుమాన్...జైభజరంగబళీకీ..పవనసుత హనుమాన్ కీ జైహో.


హనుమత్ రక్షాయాగమునకు  రామనామము లిఖించుటకు కావలసిన ప్రతిని ఇక్కడనుండి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని ఉపయోగించుకోగలరు.
http://fs08n1.sendspace.com/dl/75c638906038c11fd55f73704f17879b/506bd1d875eb3603/7f1nwi/Hanumath_Rakshayagam.rar


Or

http://www.sendspace.com/file/7f1nwi




2 వ్యాఖ్యలు:

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ September 29, 2012 at 8:57 PM  

జై శ్రీరామ్॥ జై హనుమాన్.

రామ్ December 4, 2012 at 5:59 AM  

జైశ్రీరాం....జైహనుమాన్...జైభజరంగబళీకీ..పవనసుత హనుమాన్ కీ జైహో.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP