శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇదీ విషయం [ఆదాం హవ్వలకొడుకుకు వివాహం గూర్చి]

>> Friday, September 11, 2009

[మొదటిభాగం తరువాత]

నేను ఆపాస్తర్లకువివరణ ఇచ్చాను .

క్రీస్తు తదనంతరం వందలసంవ్త్సరాల తరువాత బైబిల్ రచనమొదలయినది .అది ఇప్పటి కి నాలుగువందలసార్లకు పైగా సవరించి వ్రాయబడుతూ వున్నదని చరిత్రకారులు చెబుతున్నారు. ఆమార్గం లో సాధన చేసిన ద్రష్టలు లేదా పవిత్రమగ్రంథాన్ని వ్రాసిన ఋషులనవచ్చు. వారు వారితోపాటు మరికొందరు ఈ రచనలో పాల్పంచుకుని వున్నారు. అయితే సృష్టి ఆవిర్భవించినదని ఈరోజు శాస్త్రవేత్తలు చెబుతున్నకాలానికి ,బైబిల్ రచయితలు సూచించిన కాలానికి పొంతన కుదరటం లేదు . అది మన వేదాలలో చెప్పబడిన కాల ప్రమాణాలతోమాత్రమే సరిపోతున్నది. కాబట్టి ఈరచనలోపాలుపంచుకున్న మహానభావులు ఆదాము హవ్వల కాలంనుంచి మాత్రమే భూమిపైన జీవరాసి ఉద్భవాన్ని చెప్పగలిగారు .అందువలన సృష్టి ఇక్కడనుండి మాత్రమే ఉన్నదని చెప్పబడుతూ వస్తున్నది ఈగ్రంథములో . ఒకవేల ఆమహర్షులు కాక మధ్యలో సామ్రాజ్యవిస్తరణ ధ్యేయంగపనచెసినవారితో ఈ సృష్టి రచనావిధానం పరిశ్కరింపబడినదేమో తెలియదు మనకు. అందువలననే అక్కడ కొద్దిగా గందరగోళం నెలకొని వున్నది.

ఐతే మనం ఇటునుంచి చూద్దాము. ఆదాము హవ్వల కు ముందే సృష్టి ఉన్నది ,నాగరికతలు దేశాలు ఆన్నీ వున్నాయి . కలి పురుషుని కోరిక మేరకు సృష్టించబడిన ఆదాము హవ్వలతో ప్రారంభమయిన కాలాన్నే సృష్టి ప్రారంభకాలంగా భావించరాదు. అందుకు ఈవివరణ వినండి.

ద్వాపర యుగానంతరం తన ధర్మాన్ని కలిపురుషుడు భూమ్మీద విస్తరింపజేయవలసి వున్నది . తగవు,ద్వేషం ,వ్యభిచారాది దుర్గుణాలు, మలినం,అనాచారాలు అతని ధర్మాలు .కలహమంటే ప్రియం అతనికి. చాలాకాలం ప్రపంచం
లో తన ధర్మాన్ని విస్తరింపజేయలేక అతను దు:ఖితుడై పోయాడు. ఎక్కద చూసినా వేదమంత్రాలు యజ్ఞాలూ తపస్సులు నడుస్తుంటే అడుగుపెట్టలేక భగవంతుడైన శ్రీహరిని ఇలా ప్రార్ధిస్తాడు.
దేవా! ఎక్కదచూసినా ధర్మం అగ్నిహోత్రం వలే ప్రజ్వరిల్లుతంటే నాయుగాన నాప్రభావం ఎలా వ్యాపిస్తుంది? మీరే ఈధర్మాన్ని స్థాపించారు , మీఅనుగ్రహం లేకుండా నాకు కాలు పెట్టే అవకాశం లేదు. ఇంతకంటే కలియుగం తీసివేసి నాకు సెలవిప్పించండి అని దీనంగా వేడుకుంటాడు. అప్పుడు భగవానుడు "కలి" కి పశ్చిమ సముద్రములో ఓ ద్వీపం చూపించి అక్కడ మ్లేచ్చ జాతికి మూలపురుషుడైన ఆదముడు,హవ్యవతి అనే స్త్రీ పురుషులను ఒక సుందరవనం లో సృష్టించి ఒక సుందరమైన వనం లో వుంచి వారిలో నీధర్మాన్ని ప్రవేశపెట్టి వ్యాపింపజేసుకోమని ఆనతిస్తాడు.
అలాభగంతుని అనుగ్రహం తో పవిత్రంఘా జీవిస్తున్న ఆతోబుట్టువులకు కలి [ సైతాన్] సర్పరూపం లో వెళ్ళి జ్ఞానఫలం అనే కామాన్ని ప్రేరేపించి తద్వారా అధర్మమైన సంతానాన్ని కనమని ప్రోధ్భలం చేస్తాడు. ఫలితంగా భగవదనుగ్రహం కోల్పోయి పతితులై దివ్యశక్తులు కోల్పోయి [ఫాల్ అఫ్ మాన్ అండ్ పారడైజ్ లాస్ట్] జీవించే ఈ జంటనుండి కలిధర్మానికి మూలైన మ్లేచ్చజాతి ఉద్భవించింది . అందులోంచే ఒకశాఖ క్రీశ్టియన్,ముస్లిమ్ ,యూదు శాఖలు ఏర్పడ్దాయి. ఈవిధమైన పాపం తో పుట్టిన జాతిని బైబిల్ లోకూడా [ఒరిజనల్ సిం] వున్న సంతతిగా క్రీస్తుకూడా వర్ణించాడు , ఈ చెడు ఖర్మను అనుభవైంచదానికే క్రీస్తు శిలువనెక్కవలసి వచ్చినది.
అలా .... ఆదాము హవ్వల సంతానం ప్రారంభానికి పూర్వమే సృష్టి వికసించివున్నది . ఈవివరణ అంతా వేదవ్యాసులవారు వ్రాసిన భవిష్యపురాణం లో వర్ణించబడివున్నది. ఇలా పశ్చిమ ద్వీపం లో ఆరంభింపబడిన మ్లేచ్చధర్మము ప్రపంచమంతా వ్యాపించి ఇప్పుడు మనభాషలో పాశ్చాత్య నాగరికత అనబడే కలియుగ ధర్మానికి మూలమైనది అని భవిష్యపురాణం ఆశ్చర్యకరమైన రీతిలో వర్ణిస్తున్నది. రాబోయే యుగసంధి చివరలో జరగబోయే మహాయుధ్ధము [ఆర్మ్ ఆఫ్ గెడ్దాన్ ] శ్రీహరి కల్కావతారం గా శ్వేతాశ్వము మీద ఖడ్గధారియై ఆకాశమునుంచి వచ్చి :కలి : ధర్మాన్ని ఎలా నాశనం చేయబడుతుందో భవిష్యపురాణమేగాక ,బైబిల్ ,ఖురాన్ లాలో కూడా అవిధ్యానం లో దర్శించిన ద్రష్టలు వ్రాశారు. [దురదృష్ట వశాత్తూ మన అసలు భవిష్యపురాణం బ్రిటన్ లోని మ్యూజియం లో తాళపత్రాలలో వున్నది. బ్రిటీష్ చరిత్రకారుల చే మార్పులు చేర్పులు జరుపబడినది మనకు మారెట్ లో వున్నది. అసలు ప్రతిని డా . వేదవ్యాస లాంటి మహానుభావులు చాలాశ్రమకోర్చి చదివి వాటిలో రహస్యాలు ్ వెల్లడించారు.


నేను ఈ వివరణ ఇస్తుండగానే నరసరావు పేట స్టేషన్ రావటం తో నేను దిగాను .

భవిష్యపురాణం లో వున్న యుగరహస్యాలు మరికొన్ని తీరిక దొరికాక మీముందు వుంచుతాను మరికొన్ని పోస్ట్ లలో .

ఇదీ విషయం [ఆదాం హవ్వలకొడుకుకు వివాహం గూర్చి]




ఇక

9 వ్యాఖ్యలు:

రవి September 11, 2009 at 5:57 AM  

మతం యొక్క అంతిమ ఉద్దేశ్యం ఎప్పుడూ "self introspection" అయి ఉండాలి. ఈ విషయం చాలా విశాల వాదులుగా చెప్పుకునే పాశ్చాత్యులు మాటలలో చెబుతారు, కానీ చేతలలోకొచ్చేసరికి, పాశ్చాత్య మతం గొప్ప, అంతరూ అందులోకి మారాలి! నిజంగా పేదలకు సహాయం చేయాలంటే, మా మతంలోకి మారమని షరతులెందుకసలు?

మ్లేచ్ఛుల గురించి తెలియని కొత్త విషయాలు చెప్పారు.అభినందనలు.

Anonymous September 11, 2009 at 8:04 AM  

ఎన్నెన్నో అర్ధం కాని, ప్రశ్నల రూపంలో ఉంచలేని సందేహాలకు ఈ కధ సమాధానం చెప్పింది. ఇప్పుడిప్పుడే మానవాళి చరిత్రకు సంబంధించిన రహస్యాలు అర్ధమవుతున్న స్పష్టతని అనుభవించాను మీ ఈ చిన్ని పోస్టులో...

Malakpet Rowdy September 11, 2009 at 12:50 PM  

I dont appreciate insulting another religion. Every religion has its positives and gaps.

While I agree that the Adam-Eve theory doesnt stand ground, I also dont like the statement that those three European religions are bye-products of their sin. I protest that implication.

Anil Dasari September 11, 2009 at 1:00 PM  

>> "క్రీస్తు తదనంతరం వందలసంవత్సరాల తరువాత బైబిల్ రచనమొదలయినది"

అది కొత్త నిబంధన మాత్రమే. పాత నిబంధన అప్పటికే శతాబ్దాలుగా చలామణిలో ఉంది - యూదు మత గ్రంధంగా. ఆడమ్ & ఈవ్ కథ అందులోనుండి తీసుకున్నది.

తెలుగు వెబ్ మీడియా September 11, 2009 at 5:01 PM  

ఆదం, హవ్వల కథ ఖురాన్ లో కూడా ఉంది. ఈ కథలని నమ్మేవాళ్ళు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని అంగీకరించరు.

durgeswara September 12, 2009 at 1:27 AM  

నేను ఇతర మతాలను అవమానిస్తున్నానని ఎలా అనుకుంటున్నారు?. మూలము వెతికితే వున్నదంతా ఒకే మతము .ఆ సనాతన మతములోనే అన్నీ పుట్టాయి .అవన్నీ బోధించబూనుతున్న సత్యం ఇక్కడిదే మనం వారసత్వంగా పొందుతున్నదే అని ఆధారాలు చూపుతున్నాను . తప్ప మరేమీ కాదు.

Malakpet Rowdy September 12, 2009 at 7:30 AM  

oops thats what I understood in my first reading. I thought u said they were the by-products of some sin. Have my apologies if I got it wrong.

Anonymous September 12, 2009 at 10:22 AM  

Please see your friend Brother Anil kumar (YSR's son in law )video:

http://www.youtube.com/watch?v=oF_Gz2WHorw

Unknown February 14, 2018 at 1:18 AM  

మ్లేచ్ఛజాతి గురించి వివరణ ఇచ్చినందుకు కృతఙ్ఞతలు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP